సామాన్యుని's image
3 min read

సామాన్యుని

Sri SriSri Sri
0 Bookmarks 296 Reads0 Likes

సామాన్యుని వాస్తవికత
ఈ రోజున సామాన్యుడు
ఏమీ లేనట్టివాడు
కూడూ గూడూ గుడ్డా
ఏమీ లేనట్టివాడు
చదువూ సాము శాస్ర్తం
ఏమీ యెరుగని వాడు
ఈ రోజున సామాన్యుడు
సగం దేవతాంశ, సగం
రాక్షసాంశ, సగటున ఈ
సామాన్యుడు మానవుడు

అంటే నీవూ నేనూ
ఆమె ఈమె వీడు వాడు
అంతా సామాన్యులమే
సగం వెలుగు సగం నీడ
సగం ఋతం సగం మనృతం
సగం ఆడ సగం ఈడ
సగం పశువు సగం నిసువు
ఈ వెల్తురు ఈ చీకటి

ఈ యిరులూ ఈ వెలుగూ
వేరు వేరు గదులు కావు
ఒకటి రెండూకూడా
ఇపుడు నిప్పు ఇపుడె పువు
ఇప్పుడు దూసిన
ఇంతట్లో కౌగిలించ
ఒక నేత్రం కల్హారం
మరో కన్ను కర్పూరం

మూడో కంటి వాడంటూ
లేడంటే నమ్ముతావ్
చూడవోయ్ నీలోకి నీవు
ఒకటి రెండు వెరసి మూడు

నరకం సర్గం అన్నవి
ఒక స్థితికే రెండు పేర్లు
ఫోకస్ భేదం అంతే
లోకస్ రెండిటి కొకటే

శ్రీ అనగా లక్ష్మి, సరే
శ్రీ అంటే విషం కూడా
శ్రీ శ్రీ సిరి చేదు లేక
సిరీ సిరీ, చేదు చేదు

మీ యిష్టం శ్రీకారం
గుణకారం చేసుకొండి
మీకే అర్ధం తోస్తే
ఆ key నే వాడుకొండి

ఒకటే శ్రీ అదే రెండు
అదే చేదు సిరీ అదే
అమరతం అసురతం
శ్రీ శ్రీ ఒక మానవుడు

నే పథ్యంలో:

నీ మూసిన పిడికిటిలో
ఏమున్నది కవీ కవీ
ఆ దాచిన పళ్ళెంలో
ఏం తెచ్చావ్ సుకవీ
ఆ మూలని కవీకవీ
నీ మూసిన గుండెల్లో
ఏం దాచావ్ సుకవీ

నీ పాడని పాటలలో
రాపాడే దేదికవీ
ఆ కొసలో నీడలలో
ఏ సత్యం సుకవీ

ఏ సత్యం ఏ సప్నం
ఏ సర్గం సుకవీ
మా కోసం నీ కోసిన
వే కాన్కల పూలు కవీ

సామాన్యుని కామన

సైన్సువల్ల ఈ రోజున
సామాన్యుని బ్రతుకు కూడ
సౌందర్యమయం కాగల
సదుపాయం లభించింది

జన్మం చర్మం వెనకటి
సంప్రదాయమూ ఇప్పటి
సంఘస్థితులూ నెరపే
అసమానత పనికిరాదు

ఐశర్యం అందరిదీ
అందుచేత అందులోన
సామాన్యుడు తన వాటా
తనకిమ్మని కోరుతాడు

బతకడమే సమస్యగా
పరిణమింప జేసినట్టి
అన్యాయాలన్నిటినీ
హతమార్చాలంటాడు.

ఇదేం పెద్ద గగనమా? మ
రిదేం గొప్ప కోరికా? ఇ
కేం? ఇదొక్క విప్లవమా?
ప్రశ్నిస్తే పాపమా?

యుగసంధిది, సామాన్యుని
శకం దీన్ని కాదనరా
దిది రేపొచ్చే వ్యవస్థ
కివాళనించీ, పునాది
ఇప్పటినించీ నాంది.

అంతే, ఇంతే సప్నం:
అన్నీ ఒక్కడికి బదులు
అంత మందికీ అన్నీ:
అదే సర్గమంటాను.

ఆ సర్గం వేరే కడు
దూరంలో లేదు లేదు
ఈడే నేడే, వున్నది.
నీలో నాలో వున్నది.

మీ యిష్టం ఈ ధాత్రిని
చేయవచ్చు సర్గంగా
చీల్చవచ్చు నరకంగా
ఏం చేస్తారో సరిమరి యిక మీ యిష్టం.

No posts

Comments

No posts

No posts

No posts

No posts