
రెండు రెళ్ళు నాలుగన్నందుకు
గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో
క్షేమం అవిభాజ్యం అంటే
జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో
అసతంత్రతని జయించడానికి
అహింసాయుధం ధరించామంటూ
రక్తపాతం లేకుండానే
రాజ్యం సంపాదించామంటూ
అవినీతి భారీ పరిశ్రమలో
అన్యాయాల ధరలు పెంచేసి
సాతంత్ర్యాన్ని బ్యాంకుల్లో వేసుకుని
చక్రవడ్డీ తిప్పే కామందులకు
క్షణ క్షణం మారుతున్న లోకాన్ని
సరిగా అర్థంచేసుకున్న వాళ్ళంతా
పేద ప్రజల పక్షం వహించడమే
పెద్ద అపరాధమై పోయింది.
అహింస ఒక ఆశయమే కాని
ఆయుధం ఎప్పుడూ కాదు
ఆశయం సాధించాలటే
ఆయుధం అవసరమే మరి.
ఆశయం ఉండడం మంచిదే కాని
అన్ని ఆశయాలూ మంచివి కావు
ఆశయాలు సంఘర్షించే వేళ
ఆయుధం అలీనం కాదు.
అందుకే అంటున్నాను నేను
అందుకో ఆయుధం అని
ఆచరణకి దారితీస్తేనే
ఆవేశం సార్ధకమవుతుంది.
అందుకే సృష్టిస్తున్నాను
అధర్మనిధనంచేసే ఈ ఖడ్గాన్ని
కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది
జనంతో నిర్మిస్తున్న సర్గం ఇది
ఈ కత్తి
బూజు పట్టిన భావాలకి
పునర్జయం ఇవడానికి కాదు
కుళ్ళిపోతున్న సమాజవృక్షాన్ని
సమూలచ్ఛేదం చెయ్యడానికి
దీన్ని
నల్లబజారు గుండెల్లో దించు
దీనితో
కల్లకపటాలను వధించు
ఇది
సమాన ధర్మాన్ని స్థాపింస్తుంది
నవీన మార్గాన్ని చూపిస్తుంది
ఈ కత్తి
ఊహాసమూహాల వ్యూహాలు పన్ని
వీరవిహారం చేస్తూ
రణక్షోణిలో
జనాక్షౌహిణులు కదలడానికి
అందుకే రాస్తున్నా నొకగీతి
చేస్తున్నా నొక గేతి
రావొయి లోనికి
సందేహం దేనికి?
ఇది నిజం
నవధర్మం మానవధర్మం
అణుశక్తి కన్న
మానవశక్తి మిన్న
రావోయి రావోయి లోనికి
సంకోచం దేనికి
నను చూడగా ఇదేవేళ
నా మన: కార్మికశాల
క్రక్కేది భావాగ్ని సెగలు
క్రమ్మేది దావాగ్ని పొగలు
రావోయి రావోయి లోనికి
రాసేది రవ్యుష్ణ గీతి
చేసేది పవ్యుగ్ర హేతి
No posts
No posts
No posts
No posts
Comments