అవతారం's image
1 min read

అవతారం

Sri SriSri Sri
0 Bookmarks 110 Reads0 Likes


అవతారం
యముని మహిషపు లోహఘంటలు
మబ్బుచాటున
ఖణేల్‌మన్నాయి!
నరకలోకపు జాగిలమ్ములు
గొలుసు త్రెంచుకు
ఉరికిపడ్డాయి!
ఉదయ సూర్యుని సప్తహయములు
నురుగులెత్తే
పరుగు పెట్టేయి!
కనకదుర్గా చండసింహం జూలు దులిపీ, ఆవులించింది!
ఇంద్రదేవుని మదపుటేనుగు ఘీంకరిస్తూ, సవాల్‌చేసింది!
నందికేశుడు
రంకెవేస్తూ,
గంగడోలును కదిపిగెంతేడు!
ఆదిసూకర
వేదవేద్యుడు
ఘర్ఝరిస్తూ, కోరసాచాడు!
పుడమి తల్లికి
పురుటినొప్పులు
కొత్త సృష్టిని స్ఫురింపించాయి!

No posts

Comments

No posts

No posts

No posts

No posts